కడప వైసీపీలోకి మరో కీలకనేత జగన్ ఫోన్

కడప వైసీపీలోకి మరో కీలకనేత జగన్ ఫోన్

0
44

ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీనుంచి కొందరు వైసీపీలో చేరడం, మరికొందరు నేరుగా వేరే పార్టీల నుంచి వైసీపీలో చేరడం జరుగుతోంది. అయితే టిక్కెట్లు రాని నాయకులు నేరుగా తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేసి, పార్టీ నుంచి బయటకు వస్తున్నారు. పార్టీ తరపున కష్టపడిన వారికి టిక్కెట్లు రాలేదు అని వాపోతున్నారు. ఈ సమయంలో ఇప్పటి వరకూ మైదుకూరు టికెట్ విషయంలో అనేక చర్చలు నడిచాయి. వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యేకు జగన్ మరో అవకాశం ఇచ్చారు.

ఇక తెలుగుదేశం పార్టీ తరపున తితిదే చైర్మన్ పుట్టాసుధాకర్ యాదవ్ కు అవకాశం ఇచ్చారు. కాని టీడీపీలో డీఎల్ రవీంధ్రారెడ్డి చేరితే ఆయనకు టికెట్ ఇస్తాము అని అన్నారు. కాని ఆయనను ఎన్నికల సమయంలో పట్టించుకోలేదు .ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా సీటు కేటాయించారు అని ఆయన మదనపడ్డారు.. ఇక వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ముందు నుంచి డీఎల్ రాకను కోరుతోంది. ఇక తాజాగా ఆయన వైసీపీలో చేరాలి అని భావించారట…. ఎల్లుండి జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు సమాచారం. కాజీపేటలో డీఎల్ రవీంద్రారెడ్డిని కడప వైసీపీ అభ్యర్థి వైఎస్.అవినాష్ కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. వీరి ఇద్దరి భేటీతో ఆయన వైసీపీలో చేరడం పక్కా అని తెలుస్తోంది. ఇక ఫోన్లో కూడా జగన్ మాట్లాడారు అని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.