ఎన్నికల వేళ జగన్ కు మాస్ కౌంటర్

ఎన్నికల వేళ జగన్ కు మాస్ కౌంటర్

0
55

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వేళ చేసే రాజకీయ కామెంట్లు తెలిసిందే.. నే విన్నాను – నే ఉన్నాను అంటూ పలు రాజకీయ కామెంట్లు చేస్తున్నారు జగన్. ముఖ్యంగా వైసీపీ ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయకుండా, తన వైపు ప్రజలను తిప్పుకునేందుకు అనేక కామెంట్లు చేస్తూనే ఉన్నారు జగన్. తాజాగా పాదయాత్రలో చేసిన రాజకీయ విమర్శలు కాకుండా కొత్తగా ఎన్నికల క్యాంపెయినింగ్ లో సరికొత్త విమర్శలు చేస్తున్నారు.

ముఖ్యంగా టీడీపీ పాలన అవినీతి అంటూ చెబుతున్న జగన్ కు తెలుగుదేశం పార్టీ కూడా మాస్ కౌంటర్ ఇచ్చింది, జగన్ పై సరైన కౌంటర్ వేసే ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఈసారి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు జగన్ కు .లంచాల కాపీరైట్ జగన్దేనని అన్నారు. ఇకనైనా జగన్ భ్రమల్లో బ్రతకడం మానుకోవాలని సూచించారు.నేను విన్నాను.. నేను ఉన్నాను అనే వ్యాఖ్యలు రాజకీయంగా ఎన్నికల వేళ జగన్ చేస్తున్నారు. అయితే దీనికి కాస్త మసాలా జోడించి నేను తిన్నాను నేనుజైల్లో ఉన్నాను అని జగన్ చెప్పుకుంటే బాగుంటుంది అని కౌంటర్ ఇచ్చారు. ఇది వాస్తవం కాదా అని రాజేంద్రప్రసాద్ జగన్ కు సరికొత్త కౌంటర్ వేశారు. జగన్ ఏమిటో అందరికి తెలుసు ఆయన తెలుగుదేశం పార్టీని దొంగ అనడం ఏమిటి అని ,నేను ఉన్నాను నేను తిన్నాను నేను జైల్లో ఉన్నాను అనే స్లోగన్ జగన్ ఎన్నికల ప్రచారంలో వాడితే బాగుంటుందని సలహా ఇచ్చారు రాజేంద్రప్రసాద్.