వైసీపీలోకి శివాజీరాజా కీలక పదవి

వైసీపీలోకి శివాజీరాజా కీలక పదవి

0
79

ఇటీవల మా ఎన్నికలతో మరోసారి సినిమా ఇండస్ట్రీలో రెండు వర్గాల గురించి పెద్ద చర్చ అయితే నడిచింది.ప్రముఖ నటుడు, ఈ సమయంలో మా’(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు) శివాజీ రాజా వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారం. ఆయన త్వరలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఎన్నికల వేళ వైసీపీలోకి పలువురు కీలక నేతలు పార్టీలో చేరడం తెలిసిందే.

ఇక తాజాగా శివాజీ రాజా పార్టీలోకి ఎంట్రీ అనే వార్తలు రావడంతో ఇటు కొత్త ఆలోచనలు వస్తున్నాయి. ఇటీవల నాగబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అన్న శివాజీరాజా ఏమైనా నరసాపురం నుంచి పోటీ చేసేనాగబాబుకి ఇక్కడ కౌంటర్ ఇస్తారా అనే డౌట్ కూడా కొత్తగా ప్రజలకు రాజకీయ నేతలకు వస్తోంది. రాజకీయంగా ఇప్పుడు సినిమా స్టార్ల పోటీ అంశం తెరపైకి వచ్చింది దీంతో పెద్ద ఎత్తున చర్చ కూడా నడుస్తోంది.