ఏపీకి కేంద్రం తీపికబురు చెప్పింది. ఏపీకి రూ. 2,123 కోట్ల రుణం ఇచ్చేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. విద్యుత్ రంగ సంస్కరణలు అమలుకు గాను ఏపీ, రాజస్థాన్ లకు అదనపు ఆర్థిక వనరుల అవకాశం కల్పించింది మోడీ సర్కార్.
రాజస్థాన్ కు 5,186 కోట్ల రూపాయలు, ఏపీకి 2,123 కోట్ల రూపాయలు రుణ సదుపాయం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. విద్యుత్ రంగ సంస్కరణలు అమలు చేసిన తమకు కూడా ఆర్థిక వనరులు సమకూర్చుకునే అవకాశం కల్పించాలని ప్రతిపాదనలను 9 రాష్ట్రాలు పంపాయి. ఈ నేపథ్యంలోనే మోడీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా లోటు బడ్జెట్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆరు లక్షల కోట్ల అప్పుల్లో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా సరైన సమయంలో అందటం లేదు. ప్రతి నెల 15వ తారీఖు వరకు జీతాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు రుణాలను తీసుకుంటుంది ఏపీ సర్కార్.