కేంద్రం కీల‌క నిర్ణ‌యం వారంద‌రికి క‌రోనా టెస్టులు చేయండి

కేంద్రం కీల‌క నిర్ణ‌యం వారంద‌రికి క‌రోనా టెస్టులు చేయండి

0
95

దేశ వ్యాప్తంగా క‌రోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి, ఈ స‌మ‌యంలో ఎక్కువ‌గా కేసులు ఎక్క‌డ నుంచి వ‌స్తున్నాయి అనేది కూడా ప‌రిశోధ‌న జ‌రుగుతోంది, అయితే వ్యాపారుల‌కి వైర‌స్ సోక‌డం వారు గుర్తించ‌క‌పోవ‌డంతో అది ప‌దుల సంఖ్య‌లో మ‌రింత మందికి వ‌స్తోంది.

అందుకే దేశవ్యాప్తంగా కిరాణా దుకాణాలు, కూరగాయల మార్కెట్లు, ఇతర వ్యాపారుల ద్వారా ప్రజలకు పెద్ద ఎత్తున కరోనా వైరస్ వ్యాపించే అవకాశాలున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలంటూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది.

దీనిపై రాష్ట్రాలు ఇక ఫోక‌స్ చేయాలి, అనుమానం ఉన్నా లేక‌పోయినా క‌చ్చితంగా వారికి అంద‌రికి టెస్టులు చేయాల్సిందే, రాష్ట్రాలు దీనిపై నిర్ణ‌యం తీసుకుని వారికి టెస్టులు చేయాలి అని తెలిపింది. ఇలా చేయ‌డం వ‌ల్ల ముందుగానే అలాంటి వారిని గుర్తించ‌వ‌చ్చు అని తెలియ‌చేశారు.