చంద్రబాబు సంచలన హామీ

చంద్రబాబు సంచలన హామీ

0
111

ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవడం చారిత్రక అవసరం అని, అనుభవం ఉన్న నాయకుడు మరోసారి సీఎం అవ్వాలి అని, అమరావతి నిర్మాణం చంద్రబాబుతో సాధ్యం అని చెబుతున్నారు ఏపీ ప్రజలు, అయితే జగన్ మోదీ కేసీఆర్ కలిసి ఏపీపై కుట్ర చేస్తున్నారు అని, వీరి ఆటలు సాగనివ్వద్దు అని బాబు ఎన్నికల ప్రచారంలో చెబుతున్నారు.. అయితే ఇప్పటికే అనేక హామీలు ఇస్తున్నబాబు మరో కొత్త హామీ కూడా ఇస్తున్నారు, ఎన్నికల ముందే పించన్ల పెంపుతో అవ్వాతాతలకు ఆనందం కలిగింది.. స్త్రీలకు పసుపు కుంకుమ , రైతులకు పెట్టుబడి ఇలా ఆంధ్రప్రదేశ్ కుటుంబంలో అందరికి చంద్రబాబు మరింత దగ్గర అయ్యారు, తాజాగా వినిపిస్తున్న వార్తలు ప్రకారం.

మళ్లీ అధికారంలోకి రాగానే రూ.2వేల పింఛన్ను రూ.3వేలు చేసి చూపుతామని సీఎం చంద్రబాబు అన్నారు. అలాగే ప్రతిపక్షాలకు ఎక్కడా స్ధానం ఇవ్వకూడదు అనే ఉద్దేశ్యంతో కొత్త పందా చూపుతున్నారు బాబు. వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసు తగ్గిస్తామని చెప్పారు. అలాగే ఉచితంగా ఇళ్లు నిర్మించి తీరతామని స్పష్టం చేశారు.. తన బతుకు కోసం ఇక్కడ బతికేవారికి జగన్ శాశ్వత సమాధి కట్టాలని చూస్తున్నారని సీఎం మండిపడ్డారు. కేసీఆర్ తో కలిసి ఏపీలో మన ఆస్తులు జగన్ లాక్కుంటాడు అని, హైదరాబాద్ ని60 సంవత్సరాలు డవలప్ చేస్తే వారు మన ఆస్తులు లాక్కున్నారు అని విమర్శించారు బాబు.