వైసీపీలో చేరిన టీడీపీ మాజీ మంత్రి

వైసీపీలో చేరిన టీడీపీ మాజీ మంత్రి

0
40

ఎన్నికల వేళ నరసాపురం రాజకీయం కొత్తగా మారింది.. ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీలో ఉన్న మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ఇప్పుడు వైసీపీలో చేరారు. జగన్ సమక్షంలో నేడు వైసీపీలో చేరి పార్టీ కండువా కప్పుకున్నారు. దీంతో ఇక్కడ సరికొత్త రాజకీయం స్టార్ట్ అయింది. సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడికి టికెట్ రావడం, తెలుగుదేశం పార్టీ తనకు మోసం చేసింది అని కొత్త పల్లి ఆగ్రహంగా ఉన్నారు. అందుకే నరసాపురం లో కార్యకర్తలతో చర్చించి వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవికి టీడీపీకి గుడ్ బై చెప్పారు అలాగే ఇటీవల జగన్ ను కలిశారు.

గతంలో 2014 ఎన్నికల్లో తన కోసం టికెట్ త్యాగం చేసి, ఆచంట నుంచి పోటీ చేసి మళ్లీ ఇప్పుడు నరసాపురం నుంచి పోటీ చేస్తున్న ముదునూరి ప్రసాదరాజుకి కొత్తపల్లి సపోర్ట్ చేస్తున్నారు వైసీపీకి ఇది ప్లస్ కానుంది .ముదునూరి విజయం కోసం ఆయన సోమవారం ప్రచారం మొదలుపెట్టారు. ఇక వైసీపీలో ఆయన జగన్ సమక్షంలో పార్టీలో చేరడంతో కేడర్ మరింత బలపడింది. ఇక కౌన్సిలర్లు పంచాయతీ మెంబర్లు- సర్పంచులు ఆయన వర్గం అంతా వైసీపీకి ఇప్పుడు మద్దతు ఇస్తున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఎన్నికల సమయంలో ఇది కాస్త కష్టంగా మారింది అని చెప్పాలి.