భారీ వర్షాలు కురిసే అవకాశం..అప్రమత్తంగా ఉండండి: ఎమ్మెల్సీ కవిత

0
39

తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కాగా ఇప్పటికే అన్ని రకాల విద్యాసంస్థలకు 3 రోజులు సెలవులు ప్రకటించారు. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్షాలు, వరదల పరిస్థితిపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి , స్పెషల్ ఆఫీసర్ క్రిస్టినాతో ఫోన్ లో మాట్లాడారమే.

లోతట్టు ప్రాంతాల పట్ల ప్రత్యేక శ్రద్ద వహించాలని అధికారులను ఎమ్మెల్సీ కవిత కోరారు. ఈ క్రమంలో నేడు నిజామాబాద్ లో స్పెషల్ ఆఫీసర్ క్రిస్టినా చొంగ్తు పర్యటించనున్నారు. విద్యుత్ సౌకర్యం, ఇతర మౌళిక సదుపాయాల విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సత్వర కార్యచరణ రూపొందించాలని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

నందిపేట్, సిరికొండ, బోధన్ నియోజకవర్గాలకు మంజూరు చేసిన ప్రత్యేక అంబులెన్స్ లు ప్రజలకు విరివిగా అందుబాటులో ఉంచాలని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లో పంటలు నష్టపోయిన రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దన్న ఎమ్మెల్సీ కవిత, నష్టాలను అంచనా వేసి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు.