ఎప్పటిలాగానే ఈసారి కూడా తాము ఎగ్జిట్ పోల్స్ నమ్మము అని చెబుతున్నారు సీఎం చంద్రబాబు.. తమకు వెయ్యికి వెయ్యి శాతం గెలుపు వస్తుందని ధీమా ఉందని, తాము ఈ ఎన్నికల్లో గెలుస్తాము అని చెప్పారు, ఇక ఎగ్జిట్ పోల్స్ సగం వైసీపీ సగం తెలుగుదేశం అని చెప్పినా వైసీపీ నేతలు ఆనందం చెందుతున్నారు అని ఆయన విమర్శించారు. అయితే ఇప్పటికే ట్విట్టర్ వేదికగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు, తాజాగా మరోసారి స్పందించారు. ఆయన స్పందన చూసిన టీడీపీ నేతలు సైతం షాక్ అయ్యారు. మొత్తానికి దేశంలో యూపీఏకు బాబు సపోర్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున రాహుల్ ప్రధాని అవ్వాలి అని ఆయన కోరక ,ఇక తాజాగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయేకు అధికారం అని చెబుతున్నాయి ..ఈ సమయంలో బాబు చేసిన కామెంట్లు కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి.
ఎన్నికల రోజున తాను ఒక్క పిలుపు ఇస్తే వరదలా వచ్చి ఓటేశారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సర్వేలు చేయడం ప్రతి ఒక్కరికి అలవాటుగా మారిందన్నారు. ఐదేళ్లలో జరిగిన సంక్షేమం ఎప్పుడూ జరగలేదని.. ఇందులో ఒక్కశాతం కూడా అనుమానం లేదన్నారు. వందశాతం టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని.. టెక్నాలజీకి బానిసగా మారొద్దని.. బలిపశువులు కావొద్దని చంద్రబాబు సూచించారు. గతంలో ఈవీఎంలో ఎవరికి ఓటు పడిందో తెలిసేది కాదన్నారు. ఇక తాము పార్టీ తరపున 30 ఏళ్లుగా సర్వేలు చేస్తున్నాము అని మా సర్వేలు మాకు ఉంటాయి అని ఆయన తెలియచేశారు.. అయితే ఫలితాల్లో తాము మాత్రం గెలవడం పక్కా అని ఆయన ధీమాగా చెప్పడంతో తెలుగుదేశం నేతలు ధీమాగా ఉన్నారు.