మరో ముందడుగు వేసిన చంద్రబాబు

మరో ముందడుగు వేసిన చంద్రబాబు

0
95

సీఎం చంద్రబాబు ఏపీ ప్రజలకు వరాలు ఇస్తున్నారు… ఇప్పటికే నిరుద్యోగులకు వరాలు ఇస్తున్న బాబు, మహిళలకు కూడా మంచి హామీలు ఇస్తున్నారు… ముఖ్యంగా వైసీపీ జనసేన పార్టీలకు ధీటుగా ఆయన రాజకీయంగా పావులు కదుపుతున్నారు… ఓ పక్క జగన్ అవినీతి పరుడు ఆయనకు వెనుక నుంచి మోదీ కేసీఆర్ అండదండలు ఉన్నాయి అని చెబుతున్న చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ కచ్చితంగా గెలవాలి అని అమరావతి అభివృద్ది కావాలి అంటే మరోసారి టీడీపీ అధికారంలోకి రావాలి అని చెబుతున్నారు.

జగన్ వస్తే అమరావతి కేసీఆర్ కు తాకట్టు అవుతుంది అని , అమరావతిని అభివృద్ది చేయకుండా అడ్డుకునేందుకు వారు ఎత్తులు వేస్తున్నారు అని అన్నారు బాబు.. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారంలో వన్ మ్యాన్ ఆర్మీలా బాబు మాత్రమే ప్రచారం చేస్తున్నారు ..కానీ వైసీపీ తరపున మాత్రం వైయస్ షర్మిల వైయస్ విజయమ్మ కూడా ప్రచారాలు చేస్తున్నారు.. కేవలం తెలుగుదేశం నుంచి మాత్రం బాబు ఒక్కరే ప్రచారం చేయడం ఇక్కడ ప్రజలు కూడా గమనిస్తున్నారు.. జగన్ కుటుంబాన్ని మొత్తం ప్రచారానికి వాడుతున్నారు అనే విమర్శ వస్తోంది..ఇటు కేసీఆర్ మోదీ జగన్ ముగ్గురు త్రిమూర్తులు అంటూ ఆయన ప్రచారాల్లో కాస్త విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు.. అందుకే ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మరో ముందు అడుగు వేశారు అనే చెప్పాలి.