పార్టీలో యాక్టీవ్ అయిన జగన్ బాబాయ్

పార్టీలో యాక్టీవ్ అయిన జగన్ బాబాయ్

0
62

రాజకీయంగా మాగుంట శ్రీనివాసుల రెడ్డిని తీసుకుచ్చి ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వడంతో, అప్పటి వరకూ ఆ టికెట్ ఆశించిన జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి అలక బూనారు అని వార్తలు వచ్చాయి… గతంలో తనపై ఓటమి చెందిన వ్యక్తికి ఎలా సీటు ఇస్తారు అని విమర్శలు చేశారు.. అయితే ఆయన రాకపై విమర్శలు చేశారు వైవీ… కొద్ది రోజులుగా ఆయన పార్టీ తరపున కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు అనేది తెలిసిందే …కాని ఇటీవల ఆయన రాజకీయంగా దూకుడు పెంచారు అని తెలుస్తోంది .

తూగో పగో జిల్లా రాజకీయాలు ఆయన చూస్తున్నారు అని తెలుస్తోంది… ఆయన పార్టీ తరపున నాయకులతో మంతనాలు జరుపుతున్నారు. ఎన్నికల ప్రచారాల్లో ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి అనే విషయాలు ఆయన చర్చిస్తున్నారు అని తెలుస్తోంది.. ఓ వైపు తెలుగుదేశం చేస్తున్న ప్రచారాలను ఆయన తిప్పికొడుతున్నారు అని తెలుస్తోంది…కాని ఆయన ఒంగోలులో ప్రచారంలో పాల్గొనడం లేదు..జగన్ రాజ్యసభ పదవి ఇస్తాను అని చెబుతున్నా ఆయన మాత్రం ఎంపీగా నేరుగా పోటీ చేసేవాడిని అని కాస్త బాధలో ఉన్నారట. అయితే తర్వాత ఆ విషయం పట్టించుకోకుండా పార్టీ కోసం కష్టపడుతున్నారట… ఇటీవల జిల్లా నాయకులతో ఆయన చర్చించడంతో ఆయన పార్టీలో మళ్లీ యాక్టీవ్ అయ్యారు అని అంటున్నారు వైసీపీ నాయకులు.