చంద్రబాబు అరెస్ట్ పై పవన్ స్పందన

చంద్రబాబు అరెస్ట్ పై పవన్ స్పందన

0
88

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును నిన్న బెంజ్ సర్కిల్ వద్ద పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే… చంద్రబాబు అరెస్ట్ పై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు… చంద్రబాబు అరెస్ట్ అప్రజాస్వామికం అని అన్నారు….

అమరావతిని కాపాడుకోవాలని రాజధాని రైతులు చేస్తున్న ఉద్యమాన్ని పోలీసులు ద్వారా అనచి వేయాలని ప్రభుత్వం చుస్తోందని ఆరోపించారు…. అందులో భాగంగానే చంద్రబాబును అరెస్ట్ చేశారని అన్నారు.. శాంతి యుతంగా జరుగుతున్న ఉద్యమం హింసాత్మకంగా మరే ప్రమాదం ఉందని అన్నారు…

మహిళలను, వృద్దులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లను తీసుకువెళ్లడం దారుణం అని అన్నారు… ప్రభుత్వం రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తోందని అన్నారు… రైతుల సమస్యలు ప్రభుత్వానికి పట్టవా అని పవన్ ప్రశ్నించారు…