చంద్రబాబుకు బిగ్ షాక్ వైసీపీలోకి గుంటూరు టీడీపీ ఎమ్మెల్యే

చంద్రబాబుకు బిగ్ షాక్ వైసీపీలోకి గుంటూరు టీడీపీ ఎమ్మెల్యే

0
85

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలే అవకాశం ఉందని తెలుస్తోంది… తెలుగుదేశం పార్టీకి చెందిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి…

మద్దాలి గిరిధర్ కొద్ది సేపటిక్రితమే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసినట్లు సమాచారం… మూడు రాజధానుల ప్రకటన చేసిన తర్వాత గుంటూరు కృష్ణా జిల్లాల ప్రజలు ఆందోళ చేస్తున్న నేపథ్యంలో మద్దాలి గిరిధర్ వైసీపీలో చేరుతున్నారనే ప్రచారం రావడంతో అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది…

ఇప్పటికే కృష్ణా జిల్లాకు చెందిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే… అలాగే గుడివాడ టీడీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ కూడా టీడీపీకి గుడ్ బై చెప్పారు…