Home రాజకీయం ఏపీ అసెంబ్లీలో కరవుపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు!

ఏపీ అసెంబ్లీలో కరవుపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు!

ఏపీ అసెంబ్లీలో కరవుపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు!

0
177
Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu. (Photo: IANS)

2014-19 మధ్యకాలంలో వ్యవసాయ అభివృద్ధి విషయంలో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తెలిపారు. దేశంలో ఇతర రాష్ట్రాలకు సాధ్యం కానివిధంగా వ్యవసాయ రంగంలో 11 శాతం అభివృద్ధి సాధించామని అన్నారు. ఈ విషయాన్ని నిన్నే మీ మంత్రి ఒప్పుకునే పరిస్థితికి వచ్చారని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా సున్నావడ్డీకి రుణాల విషయంలో చంద్రబాబు సీఎం జగన్ సవాల్ ను స్వీకరించాలని వైసీపీ ఎమ్మెల్యేలు గట్టిగా డిమాండ్ చేయడంతో చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ‘కాదండీ.. రికార్డ్స్ ఆయన దగ్గరే ఉన్నాయ్. వెరిఫై చేసుకోమని చెప్పండి. దానికి అభ్యంతరం చెప్పలేదు. ఆయన(జగన్) కు సమాధానం నేను ఎందుకు చెప్పాలి?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు నిరసన తెలపడంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది.