చంద్రబాబుకు బిగ్ షాక్… అజ్ఞాతంలోకి టీడీపీ పిల్ల‌ర్…

చంద్రబాబుకు బిగ్ షాక్... అజ్ఞాతంలోకి టీడీపీ పిల్ల‌ర్...

0
82

అరెస్ట్ వార్తల నేపథ్యంలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అండర్ గ్రౌండ్ కు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి… గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించిన నర్సీపట్నం మున్సిపల్ కమీషనర్ ను దూషించారని ఆయనపై నిర్భయతో పాటు అట్రాసిటి కేసు నమోదు చేశారు పోలీసులు… ఈ కేసులో భాగంగా అయ్యన్న పాత్రుడు అరెస్టుకు పోలీస్ బృందాలు ప్రయత్నం చేస్తుండగా మరో వైపు ఆయన ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి..

మరో వైపు టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు… వైసీపీ సర్కార్ కక్ష సాధింపు నేపధ్యంలో టీడీపీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేయిస్తుందని మండిపడుతున్నారు..

అందులో భాగంగానే గతంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అలాగే తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిలను అరెస్ట్ చేయించిందని ఆరోపిస్తున్నారు.. అధికార వైసీపీ తమ పార్టీలో చేరాలని వేధింపులకు గురి చేస్తోందని చేరకపోవడం వల్లే ఇలాంటి బెధిరింపులకు గురి చేస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు…