చంద్రబాబుకు బిగ్ షాక్ ఇస్తూ కుప్పం ప్రజలు లేఖ…

చంద్రబాబుకు బిగ్ షాక్ ఇస్తూ కుప్పం ప్రజలు లేఖ...

0
91

చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పోటీ చేసిన కుప్పం సెగ్మెంట్ మినహా మిగిలిన అన్ని సెగ్మెంట్ లను వైసీపీ గెలుచుకుంది… అయితే ఇప్పుడు కుప్పం ప్రజలు కూడా చంద్రబాబు మీద ఫైర్ గా ఉన్నారు మామూలు సమయంలో ప్రజలకు దగ్గరకు వెళ్ల కున్నా పర్యాలేదు కానీ విపత్కర సమయంలో వారికి అండగా ఉండాలి అది నాయకుడి లక్షణం..

ప్రస్తుతం ఏపీ అంతటా కరోనా నృత్యం చేస్తోన్న సమయంలో చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ఉన్న తన నివాసానికే పరిమితం అయ్యారు… దీంతో కుప్పం ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు… తాజాగా ఆ నియోజకవర్గం ప్రజలు ఒక లేఖను చంద్రబాబు నాయుడుకు రాశారు అది కుప్పం ప్రజలు రాశారో లేదో తెలియదుకానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతోంది…

మీరు లాక్ డౌన్ బాగా పాటిస్తున్నారు బాగానే ఉంది.. మీకంటే కోటాను కోట్లు ఆదాయం ఉంది మీలా ఆదాయం ఉన్న వారు విపత్కర పరిస్థితుల్లో ఎలా లేదన్నా ఆరు నెలలు బ్రతికేస్తారు.. కానీ మేము అలా కాదు ప్రభుత్వం ఇస్తున్న చాలీ చాలని సరుకులతో తమ జీవనం గడపడం కష్టంగా ఉందని ఇప్పటికే పక్క నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తమ ప్రజలకోసం సొంత డబ్బులు తీసి సరుకులు పంపిణీ చేస్తున్నారు… ఇలాంటిది మీపాటి వరికి చాలా చిన్నది మీరు ఎందుకు అలా చెయ్యడం లేదని లేఖ ద్వారా చంద్రబాబు నాయుడును ప్రశ్నించారు…