చంద్రబాబుకు బిగ్ షాక్…. గోడ దూకేందుకు సిద్దమైన 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలు….

చంద్రబాబుకు బిగ్ షాక్.... గోడ దూకేందుకు సిద్దమైన 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలు....

0
91

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగలనుందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు… సుమారు 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలు గోడ దూకేందుకు సిద్దమయ్యారని వార్తలు వస్తున్నాయి… ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు. వల్లభనేని వంశీ అలాగే మద్దాలి గిరి, కరణం బలరాంలు వైసీపీకి సపోర్ట్ గా ఉన్నారు…

ఇక ఇదే క్రమంలోనే సుమారు 10 మంది ఎమ్మెల్యేలు వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారని వార్తలు వస్తున్నాయి… అయితే దగ్గరలో రాజ్యసభ ఎన్నికలు ఉండటంతో వారు టీడీపీలో ఉండిపోయారని అంటున్నారు… టీడీపీ విప్ జారీ చేస్తుందని ఆ విప్ ఉల్లంఘిస్తే ఎమ్మెల్యే పదవి పోతుందనే ఉద్దేశంతో అలాగే ఉండిపోయారట…

ఎన్నికలు పూర్తి అయిన తర్వాత గోడ దూకేందుకు సిద్దమయ్యారని అంటున్నారు… వీరందరు వైసీపీలో చేరితే చంద్రబాబు నాయుడుకు ప్రధాన ప్రతిపక్ష హోదా పోతుంది… మరి చంద్రబాబు నాయుడు తన రాజకీయ చాణక్యంతో ఎలాంటి ప్లాన్లు వేస్తారో చూడాలి…