చంద్రబాబుకు బిగ్ షాక్… ఎంపీ గల్లా జయదేవ్ టీడీపీకి గుడ్ బై…?

చంద్రబాబుకు బిగ్ షాక్... ఎంపీ గల్లా జయదేవ్ టీడీపీకి గుడ్ బై...?

0
89

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రస్తుతం షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి… 2019 సార్వత్రిక ఎన్నికల్లో అధికారం కోల్పోపోయిన తర్వాత నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన తమ్ముళ్లు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు… ఛాన్స్ దొరికితే వైసీపీ లేదంటే బీజేపీలోకి జంప్ చేస్తున్నారు…

ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి చేరగా ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతుగా నిలిచారు… ఇటీవలే టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి సిద్దారాఘవరావు సైతం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం తీసుకున్నారు… ఇక ఈ షాక్ నుంచి చంద్రబాబు నాయుడు కోలుకోక ముందే మరో బిగ్ షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి…

గుంటూరు జిల్లా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఆ పార్టీని విడిచి పెట్టాలనే ఆలోచనతో ఉన్నారని వార్తలు వస్తున్నాయి… కొంత కాలంగా పార్టీలోని కొందరు ఆయన్ను ఇబ్బంది పెడుతున్నారని లోకేశ్ అండతో కొందరు నేతలు గల్లాను పక్కన పెట్టారని వార్తలు వస్తున్నాయి… అగ్రనేతలు సైతం ఇలానే ప్రవర్తిస్తుండటంతో గల్లా అసంతృప్తిగా ఉన్నారట… ఈ అసంతృప్తితోనే ఆయన టీడీపీకి గుడ్ బై చెబుతారని వార్తలు వస్తున్నాయి… గల్లా పార్టీ వీడితే టీడీపీ సంఖ్య మూడు నుంచి రెండుకు చేరుకుంటుంది…