ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగలనుందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు… పార్టీకి చెందిన మాజీ మంత్రి వైసీపీలో చేరాలని చూస్తున్నారట….
ఏపీలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు రావచ్చని ప్రకటించారు… జగన్ ప్రకటనకు కొంతమంది రాజకీయాలు చేయకుండా తన ప్రాంతాలు అభివృద్ది చెందాలనే ఉద్దేశంలో జగన్ కు సపోర్ట్ చేస్తున్నారు…. అలా సపోర్ట్ చేసిన వారిలో మాజీ మంత్రి కొండ్రుమరళి ఒకరు…
రాజధాని విషయంలో చంద్రబాబును తాము ఒప్పిస్తామని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే… తమకు పార్టీ కంటే ప్రాంతం అభివృద్ది ముఖ్యమని చెప్పడంతో ఆయన త్వరలో వైసీపీలో చేరే అకాశాలు ఉన్నాయని టీడీపీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది…