మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు నాటినుంచి 2014 ఎన్నికలవరకు ఉత్తరాంధ్ర ప్రాంతం ఆ పార్టీకి కంచుకోటగా నిలిచిన సంగతి తెలిసిందే… ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా ఈ మూడు జిల్లాల్లో పసుపు జెండా ఎగరాల్సిందే… అలాంటి ఈ ప్రాంతంలో 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సునామిలా దూసుకువచ్చింది…
విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వైసీపీనే మెజార్టీ స్థానాలను సాధించి చరిత్రను తిరగరాసింది…. ఈ మూడు జిల్లాల్లో టీడీపీ ఎక్కువగా విశాఖలో నాలుగు సీట్లు వచ్చాయి… అయితే ఇప్పుడు ఈ నలుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్ చేసేందుకు సిద్దమయ్యారని వార్తలు వస్తున్నాయి..
ఆపరేషన్ ఆకర్షన్ కి వైసీపీ తెర తీసిన వేళ విశాఖ నుంచి గంటా పేరు మళ్లీ గట్టిగా వినిపిస్తోంది… ఇక ఆయన బాటలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా నడుస్తారని వార్తలు వస్తున్నాయి… పార్టీలో ఇలాగే కొనసాగితే తమకు రాజకీయ భవిష్యత్ ఉండదని గ్రహించి వారు కూడా వైసీపీ చేరాలని చూస్తున్నారట…