చంద్రబాబుకు షాక్ టీడీపీలో మరో బిగ్ వికేట్ డౌన్

చంద్రబాబుకు షాక్ టీడీపీలో మరో బిగ్ వికేట్ డౌన్

0
81

ఒక వైపు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాడి తప్పిన తెలుగుదేశం పార్టీని ట్రాక్ లో పెట్టాలని చూస్తుంటే తమ్ముళ్లు మాత్రం తలోదారి పడుతున్నారు… దీంతో పార్టీలోని సభ్యుల సంఖ్య క్రమ క్రమంగా తగ్గుతూ వస్తోంది….

ఇప్పటికే ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ లు టీడీపీకి టాటా చెప్పిన సంగతి తెలిసిందే… వీరి తర్వాత గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దాలి గిరి జగన్ మోహన్ రెడ్డిని కలిశారు… దీంతో ఆయన కూడా వైసీపీలో చేరుతారని ప్రచారం జోరుగా సాగుతోంది…

ఇక ఈ షాక్ నుంచి చంద్రబాబు నాయుడు కోలుకోకముందే మరో షాక్ తగిలింది… తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడి పదవికి నాదేండ్ల బ్రహ్మం చౌదరి కూడా రాజీనామా చేశారు… వ్యక్తిగత సమస్యలతో రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు… ఇక నుంచి రాజకీయాలకు దూరంగా సామాజిక సమస్యలకోసం పోరాడుతానని అన్నారు…