చంద్రబాబుకు షాక్ వైసీపీకి మరో మాజీ ఎమ్మెల్యే

చంద్రబాబుకు షాక్ వైసీపీకి మరో మాజీ ఎమ్మెల్యే

0
91

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడకు మరో బిగ్ షాక్ తగిలింది.. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ శమంతకమణి, మాజీ ఎమ్మెల్యే యామినీబాల టీడీపీకి గుడ్ బై చెప్పి నేడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు

ఈరోజు ఆమె తన అనుచరులతో కలిసి వైసీపీ తీర్థం తీసుకున్నారు… దీంతో సింగనమల నియోజకవర్గంలో టీడీపీకి ఇది పెద్ద షాక్ తగిలింది… 2014 ఎన్నికల్లో యామినీ బల టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు.. 2019లో టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత నుంచి పార్టీ అధిష్టానంపై గుర్రున ఉన్నారు… తాజాగా ఆమె వైసీపీ తీర్థం తీసుకున్నారు…

కాగా ఇప్పటికే చాలామంది నేతలు టీడీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే… రామసుబ్బారెడ్డి, కరణం బలరాం, డొక్కా మాణిక్య వరప్రసాద్, పులివెందుల సతీష్ రెడ్డి, రెహమాన్ వంటివారు సైకిల్ దిగిపోయారు…