చంద్రబాబుకు విజయసాయిరెడ్డి చురకలు

చంద్రబాబుకు విజయసాయిరెడ్డి చురకలు

0
82

అధికారం కోల్పోయినా, పరివర్తన లేకుండా కుంభకోణాలు, నేరాలకు పాల్పడిన నేతలను వెనకేసుకు రావడం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే చెల్లిందని ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు… ప్రభుత్వ పొరపాట్లను ఎత్తిచూపాల్సిన ప్రతిపక్షం తనే ఆత్మరక్షణ ధోరణిలో పడటం విస్మయం కలిగిస్తోందని అన్నారు. తప్పు చేసినా బహిష్కరించే ధైర్యం లేదనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లిపోయాయని అన్నారు.

ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకోవాలంటే, వారి హితం కోసం ఆరాటపడాలని అన్నారు పబ్లిసిటీ కోసం కాదని తెలిపారు. కుల మీడియా ఊతకర్రలను నమ్ముకుని తానొక శిఖర సమానుడిగా నిత్యం భ్రాంతిలో చంద్రబాబు నాయుడు మునిగి తేలుతుంటారని మండిపడ్డారు విజయసాయి రెడ్డి. అందుకే ఎవరికీ సంబంధం లేని వ్యక్తయి పోయారని ఆరోపించారు….