చంద్రబాబు నాయుడుకు బిగ్ షాక్ వైసీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యే కుమారుడు

చంద్రబాబు నాయుడుకు బిగ్ షాక్ వైసీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యే కుమారుడు

0
98

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు వరుస షాక్ లు తగులుతున్నాయి… పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత చాలామంది నేతలు సైకిల్ దిగి వైసీపీ చెంత చేరుతున్నారు… ఇప్పటికే చాలామంది నేతలు వైసీపీ తీర్థం తీసుకున్నారు…

ఇదే క్రమంలో విశాఖ టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమారుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు… రాష్ట్రంలో వైసీపీ సర్కార్ చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలను చూసి తాను వైసీపీ పార్టీలో చేరానని అన్నారు… విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ను తాము స్వాగతిస్తున్నామని అన్నారు…

కాగా వాసుపల్లి కొద్దికాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే… టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచినా కూడా ఆయన వైసీపీ దగ్గరగా ఉంటున్న సంగతి తెలిసిందే…ఇప్పటికే టీడీపీ ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతుగా ఉన్న సంగతి తెలిసిందే…