చంద్రబాబును అడ్డుకునేందుకు భారీ కుట్ర

చంద్రబాబును అడ్డుకునేందుకు భారీ కుట్ర

0
83

జగన్ వ్యవహార శైలి చూస్తుంటే ప్రజా సమస్యల పై ప్రతిపక్షాలు నోరెత్తకూడదన్నట్టు ఉందని లోకేశ్ ఫైర్ అయ్యారు . జగన్ ప్రతిపక్షంలో ఉండగా ఎన్నోసార్లు అసెంబ్లీలో నిరసన తెలిపారని గుర్తు చేశారు. అయితే అప్పట్లో వారికి ఉన్న హక్కు, ఇప్పటి ప్రతిపక్షమైన టీడీపీకి ఎందుకు ఉండదని ప్రశ్నించారు…

సభలో ప్రజా సమస్యల పై నిరసన తెలిపే హక్కులు హరించే అధికారం జగన్ కి ఎవరిచ్చారని లోకేశ్ ప్రశ్నించారు… ప్రతిపక్షాలకు శాసనసభలో నిరసన తెలిపే హక్కు లేదని ఏ చట్టం చెబుతుందని ప్రశ్నించారు…

ప్రతిపక్ష సభ్యులను అగౌరవపరిచే రీతిలో, చంద్రబాబుని సైతం చేతులతో అడ్డుకునే అధికారం మార్షల్స్‌కు ఎవరిచ్చారు మండిపడ్డారు… చంద్రబాబు చేతిలో కాగితాలు ఉంటే గేటు బయటే నిలబెడతారా అని ప్రశ్నించారు ప్రతిపక్షాన్ని సభల్లోకి రానివ్వకుండా చేయాలనే కుట్ర పడుతున్నారని లోకేశ్ మండిపడ్డారు…