చంద్రబాబుపై నాని తీవ్ర స్థాయిలో ఫైర్

చంద్రబాబుపై నాని తీవ్ర స్థాయిలో ఫైర్

0
87

బోస్టన్ కమిటీ జీఎన్ రావు కమిటీని భోగి పండుగ రోజునాడు మంటలలో వేయాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న సంగతి తెలిసిందే… అయితే ఆయన చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు…

బోస్టన్ కమిటీ జీఎన్ రావు కమిటీని భోగి పండుగ రోజునాడు మంటలలో వేయాలని చంద్రబాబు వ్యాఖ్యానించడం తగదన్నారు… తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… 74 ఏళ్ల చరిత్ర కలిగిన బోస్టన్ కంపెనీ నివేదికను తప్పుబట్టే చంద్రబాబు ఎందుకు సింగపూర్ కంపెనీతో 800 కోట్లు ఒప్పందం చేసుకున్నారని ప్రశ్నించారు…

కరెన్సీ నోట్లు మారినప్పుడు ఆ కంపెనీ నివేదికకు బాబు ఎందుకు తలొగ్గారని నాని ప్రశ్నించారు… రాజధాని రైతులు తమ కోరికలతో ప్రభుత్వాన్ని కలిస్తే మేలు జరుగుతుందని అన్నారు… చంద్రబాబు నాయుడుతో కలిసి మోసపోవద్దని అన్నారు…