చంద్రబాబుపై విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

చంద్రబాబుపై విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

0
87

టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐదేళ్ల పాలనలో ప్రభుత్వాసుపత్రులను గాలి కొదిలేసి, ప్రైవేటు వైద్యాన్ని ప్రోత్సహించారని ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. వాటిపై నియంత్రణ ఉండాలని కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని చంద్రబాబు నాయుడు తుంగలో తొక్కారని ఆరోపించారు.

ఆరోగ్య శ్రీ కార్డులు ఇతర రాష్ట్రాల్లో చెల్లకుండా చేసి రోగుల ఉసురు తీశారని ఆయన మండిపడ్డాడు. కమిషన్ల కోసం ప్రజారోగ్య వ్యవస్థను బలి చేశారని ఆరోపించారు….

రాష్ట్రంలో సమస్త ప్రభుత్వ యంత్రాంగం కంటిపై కునుకు లేకుండా కరోనా మహావిపత్తుపై పోరాడుతుంటే పొరుగు రాష్ట్రంలో కూర్చున్న చంద్రబాబు నాయుడు కరోనా లెక్కలతో కుస్తీలు పడుతున్నారని మండిపడ్డారు. బురదజల్లుడు రాజకీయాలకు ఇది వేళ కాదన్న కనీస స్పృహ లేకుండా వ్యవహరిస్తున్నారని విజయసాయిరెడ్డి మండిపడ్డారు…