మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కేసులకు భయపడి ప్రధాని మోదీ కాళ్లు పట్టుకోవడానికి సిద్దమయ్యారని….. గతంలో సోనియా గాంధీ కాళ్లు పట్టుకున్నారని ప్రభుత్వ ఛీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు…
తాజాగా ఆయన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు ఔట్ డేటెడ్ లీడర్ అని ఆయన కుమారుడు లోకేశ్ అప్ డేటెడ్ లీడర్ అని అన్నారు…. జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక టీడీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు…
ప్రస్తుతం చంద్రబాబు నాయుడు రౌడీ షీటర్లను మాఫియాను వెనకేసుకువస్తున్నారని అరాచక శక్తులను ప్రోత్సహించే విధంగా ఆయన మాట్లాడుతున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు..