చంద్రబాబుకు షాక్… అలక చెందిన మరో టీడీపీ ఎమ్మెల్యే…

చంద్రబాబుకు షాక్... అలక చెందిన మరో టీడీపీ ఎమ్మెల్యే...

0
87

2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత తమ్ముళ్లు తలోదారి చూసుకుంటున్నారు… దీంతో రానురాను పార్టీలో సభ్యుల సంఖ్య తగ్గువస్తోంది… అయితే ఉన్న కొద్దిమందిని కాపడుకునే ప్రయత్నం కూడా టీడీపీ అధిష్టానం చేయకపోవడంతో వారు మనస్తాపంకు గురి అయ్యేటట్లు చేస్తోందని వార్తలు వస్తున్నాయి… తాజాగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు అధిష్టానంపై అలక చెందారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి…

గతంలో తండ్రి వారసత్వాన్ని తీసుకుని రాజకీయ అరంగేట్రం చేసిన గణబాబు 2014 అలాగే 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున విశాఖ పశ్చిమ నుంచి పోటీ చేసి గెలిచారు… గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలి వీచినా కూడా ఆయన గెలిచారు… ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటాడనే పేరు తెచ్చుకున్నారు.. ఇటీవలే ఎల్జీ పారిమర్స్ సంఘటన సమయంలో ప్రజల మధ్యే ఉన్నారు.. కానీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం బాధితులను పరామర్శించేందుకు రాలేదు…

కానీ మృతుల కుటుంబాలకు 50వేలు ప్రకటించారు… అదే సమయంలో టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కామ్ లో అరెస్ట్ అయ్యారు… ఆయనను పరామర్శించేందుకు వెళ్లాలంటే తన నియోజకవర్గం మీదుగానేవెళ్లాలి కానీ లోకేశ్ ఎల్జీ పాలిమర్స్ బాధిత కుటుంబాలను పరామర్శించకుండా శ్రీకాకుళంకు వెళ్లారు… దీంతో తనపై టీడీపీ అధిష్టానం చిన్న చూపు చూస్తోందని భావిస్తోన్నారట గణబాబు అందుకే ఆయన కొద్దికాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారని కొంత మంది చర్చించుకుంటున్నారు..