చంద్రబాబుకు షాక్.. త్వరలో వైసీపీలోకి ఎమ్మెల్యేలు, మాజీలు

చంద్రబాబుకు షాక్.. త్వరలో వైసీపీలోకి ఎమ్మెల్యేలు, మాజీలు

0
100

త్వరలో ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన మరికొంత మంది ఎమ్మెల్యేలు, మాజీలు, సీనియర్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకునేందుకు సిద్దంగా ఉన్నారా అంటే అవుననే అంటున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే కరణం బలరాం… తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో టీడీపీకి చెందిన కొందరు వైసీపీలో చేరే అవకాశం ఉందని అన్నారు…

ప్రస్తుతం టీడీపీ నేతలు ఎవరికి వారు వ్యక్తి గతంగా సంప్రదింపుల చేసుకుంటున్నారని తెలిపారు… టీడీపీలో సీనియర్లకు కనీసం గౌరవం దక్కకుందని ఆరోపించారు… చంద్రబాబు నాయుడు ఎంతో మానసికంగా వేదనకు గురి చేశారని మండిపడ్డారు.. నారాలోకేశ్ తనను విమర్శించే స్థాయి కాదని అన్నారు… ఎవరినైనా వాడుకుని వదిలేసే తత్వం చంద్రబాబు నాయుడుదని మండిపడ్డారు…

వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని అన్నారు…. జగన్ పై విమర్శలు చేసే టీడీపీ ఎమ్మెల్యేలు ఆత్మసంతృప్తి పొందుతున్నారని ఆరోపించారు… కాగా ఇటీవలే కరణం టీడీపీకి రెబల్ గా మారారు… అధికార వైసీపీ పార్టీ తీర్థం తీసుకోకున్నా ఆపార్టీకి మద్దతుగా ఉన్నారు… ఇటీవలే సిద్దా రాఘవరావు వైసీపీ తీర్ధం తీసుకున్నారు…