కరోనా విషయంలో జగన్ సర్కార్ మరో బిగ్ డెసిషన్…

కరోనా విషయంలో జగన్ సర్కార్ మరో బిగ్ డెసిషన్...

0
38

ఏపీ ప్రభుత్వం కరోనా టెస్ట్ ల విషయంల సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది… కరోనా టెస్ట్ నిర్వహించిన వ్యక్తికి సంబంధించిన రిపోర్ట్ ను సంబంధిత వ్యక్తికే మెస్సెజ్ రూపంలో పంపించనుంది… కరోనా నిర్ధారణ పరీక్షఫలితాల కోసం ఇకపై సంబంధిత వ్యక్తి నమోదు చేసుకున్న సెల్ ఫోన్ నెంబర్ కే కరోనా టెస్ట్ ఫలితాన్ని పంపించడం ద్వారా సంబంధిత పాజిటివ్ వ్యక్తి కరోనా వైద్యం చికిత్స తీసుకుకోవడానికి త్వరితగతి స్పందించే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తుస్తున్నారు..

ప్రస్తుత పరిస్ధితుల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న వ్యక్తి ఫలితాలు ల్యాబ్ నుంచి నేరుగా ఆన్ లైన్ ద్వారా వైద్యులకు సంబంధిత అసుపత్రుల సూపరిడెంట్ లకు తెలియజేస్తున్నారు.. దీంతో వారు సరిగా గుర్తించకుంటే కొన్ని సమస్యలు తలెత్తుతున్న పరిస్ధితి కనిపిస్తోంది…

ఇక పరీక్షలు చేయించుకున్న వ్యక్తికి వైద్యుల నుంచి తన పరీక్షలకు సంబంధించిన సమాచారం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది… పరీక్ష చేయించుకున్న వ్యక్తికే ఫలితాన్ని పంపించడం వల్ల వారు అప్రమత్తంగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్న సర్కార్ వారికి నేరుగా సెల్ నెంబర్ కు ఫలితాన్ని పంపించనున్నారు…