ప్రధాని మోదీ ఏపీ రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు

ప్రధాని మోదీ ఏపీ రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు

0
119

ఒంగోలు ఈవెంట్ లో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ భవిష్యత్ అంతా ఆవిష్కరణలదే. విజన్ లేకపోతే జీవితంలో ఏమీ సాధించలేరు. నూతన ఆవిష్కరణలపై విద్యార్థులు దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం ఒంగోలు లో జరిగిన .. జ్ఞానభేరి కార్యక్రమంలో అయన పాల్గొన్నారు. చంద్బరాబు మాట్లాడుతూ జవాబుదారీతనంతోనే అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను కంప్యూటరైజ్ చేస్తున్నాం. ప్రపంచానికి సేవలందించే సామర్థ్యం భారత్కు ఉంది. భవిష్యత్తులో మూడు ప్రధాన దేశాల్లో భారత్ ఉంటుందన్నారు. గొప్పవారంతా సాధారణ కుటుంబంలో పుట్టినవాళ్లేనని మనదేశంలోనే కాకుండా అమెరికాలోనూ మన తెలుగువాళ్లు ప్రగతిపథంలో దూసుకెళ్తున్నారని అన్నారు. ఏపని చేసినా జవాబుదారీతనం అవసరమని, జవాబుదారీ తనంతోనే అద్భుతమైన ఫలితాలు వస్తాయని చంద్రబాబు అన్నారు. ప్రధాని మోదీ ఏపీ రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు. ఏపీకి రావాల్సిన ఫలాల కోసం ఎంత సమయం వేచి చూసినా ఇవ్వలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి వల్ల ఆర్బీఐ గవర్నర్ రాజీనామా చేశారని, చరిత్రలో చెడ్డపేరు రాకుంటే చాలనుకున్నారని. సీబీఐ వ్యవస్థ కుప్పకూలిపోయో పరిస్థితి వచ్చిందన్నారు. మాకు రావాల్సిన హక్కులను మాకివ్వండంటే దాడులు చేసే పరిస్థితికి వచ్చారన్నారు. నేను కూడా మౌనంగా ఉంటే కుదరదని, దేశంలో అన్నీ పార్టీలను ఒకే తాటిపైకి తీసుకొచ్చానని అన్నారు. నిన్న ఎన్నికల ఫలిలతాల్లో బీజేపీ ఎక్కడా గెలవలేదు. పోలవరానికి 3500 కోట్లు ఖర్చు పెడితే ఇంతవరకూ కేంద్రం ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఈ రోజు నదుల అనుసంధానం చేస్తున్నాం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చూడటానికి విద్యార్థులను తీసుకెళ్లాలి. పట్టిసీమ ద్వారా గోదావరి, కృష్ణ నదులను అనుసంధానం చేశాం. గోదావరి, పెన్నా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాం పనులు జరుగుతున్నాయన్నారు. భవిష్యత్తులో నాగార్జున సాగర్ రైట్ కెనాల్ వరకు ఫేజ్ వన్ లో పూర్తి చేస్తామన్నారు. కడపలో స్టీల్ ప్లాంట్కు అడ్డుపడుతున్నారు. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం కూడా ఈ ప్రభుత్వమే తీసుకుంటుందన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెయ్యకపోయినా, ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఏ మార్గాలున్నాయో ఆలోచిస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శిద్దా రాఘవరావు, కరణం బలరాం, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గోన్నారు.