చంద్రబాబు ఫారిన్ టూర్..!!

చంద్రబాబు ఫారిన్ టూర్..!!

0
106

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘోరమైన వైఫల్యం అనంతరం మీడియాకి చాలా దూరంగానే ఉన్నారు. అయితే చాలా రోజుల తరువాత కాస్త విశ్రాంతి దొరికిందని అనుకున్నారో ఎమో కాని ఎంచక్కా ఫారిన్ టూర్ ప్లాన్ చేశారు. అందుకు గాను చంద్రబాబు ఈ నెల 7న కుటుంభ సమేతంగా విదేశీ పర్యటనకు వెళుతున్నారు. అయితే చంద్రబాబు ఎప్పుడు విదేశాలకి వెళ్ళిన టూర్ షెడ్యూల్ మాత్రం ముందుగానే రిలీవ్ అయ్యేది కాని ఈ సారి మాత్రం చంద్రబాబు షెడ్యూల్ అత్యంత గోప్యంగా ఉంచారు. అధికారంలో లేననే భావనతోనో లేక మరేదన్నా కారణం ఉందొ ఏమో కానీ మొత్తానికి బాబు గారి టూర్ సీక్రెట్ అంతా అనేక సందేహాలని కలిగిస్తోంది.

ఇందుకు చాలా మంది చాల రకాలుగా అంటున్నారు. సోషల్ మీడియాలో చంద్రబాబు పై పలు రకాల ఊహాగానాలు వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు హయాంలో జరిగిన అక్రమాలపై, అవకతవకలపై విచారణ జరిపిస్తా, తప్పులుంటే అంతే సంగతులు అంటూ జగన్ హెచ్చరించడంతో భయపడిన చంద్రబాబు ఫారిన్ టూర్ వంక పెట్టుకుని వెళ్లి పోతున్నారని. కేసుల భయంతో ఇక అక్కడే ఉండి పోతారని ఇప్పటికే సెటైర్లు వినిపిస్తున్నాయి. అయితే చంద్రబాబు మాత్రం తిరిగి 14వ తేదిన ఇండియాకు వచ్చి పార్టీ నేతలతో భేటీ కానున్నారని సామాచారం.