చంద్రబాబు కోరిక…. సక్సెస్ అవుతుందా లేదా

చంద్రబాబు కోరిక.... సక్సెస్ అవుతుందాలేదా

0
91

ఇటీవల దావోస్ లో కూడా పారిశ్రామికవేత్తలు ఏపిలో గత 9నెలల రివర్స్ పాలనపై ఆందోళన వ్యక్తం చేశారని ఆరోపించారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసీపీ తీరుతో రాష్ట్రానికి చెడ్డపేరు రావడమే కాకుండా, లక్షలాది యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోతోందని ఆరోపించారు. ఇకనైనా వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాభివృద్దిపై, భావితరాల భవిష్యత్తుపై దృష్టిసారించాలని చంద్రబాబు కోరారు…

టీడీపీ హయాంలో పెట్టుబడుల ఆకర్షణలో మహారాష్ట్ర, గుజరాత్ లతో పోటీబడ్డామని అలాంటిది వైసీపీ ప్రభుత్వంలో పిపిఏల రద్దు, వాటాల కోసం బెదిరింపులు, డీలర్ షిప్ ల కోసం వేధింపులు తట్టుకోలేక 9నెలల్లోనే రూ.లక్షా 80వేల కోట్ల పెట్టుబడులు వెనక్కిపోవడం బాధాకరం అని ద్వజమెత్తారు చంద్రబాబు..

గత ఏడాది(2018-19) అత్యధిక పెట్టుబడులు(11.8%) ఆకర్షించి దేశంలోనే ఏపి అగ్రస్థానంలో ఉందని తెలిపారు… అంతేకాకుండా గత 5ఏళ్లలో (2014-19) దేశవ్యాప్తంగా రూ 7,03,103కోట్ల పెట్టుబడులు వస్తే, అందులో ఏపికి రూ.70వేల కోట్లు వచ్చాయని తెలిపారు… అందుకు ఆర్బీఐ తాజా బులెటిన్ వివరాలే ప్రత్యక్ష సాక్ష్యం అని అన్నారు చంద్రబాబు