బంట్రోతు అన్న చెవిరెడ్డి: చంద్రబాబు ఆగ్రహం.. బొట్టు, చీర పంపాలా? అంటూ జగన్ కౌంటర్..!!

బంట్రోతు అన్న చెవిరెడ్డి: చంద్రబాబు ఆగ్రహం.. బొట్టు, చీర పంపాలా? అంటూ జగన్ కౌంటర్..!!

0
92

తనను చంద్రబాబు బంట్రోతుగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి అభివర్ణించడంపై టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయిన తమ్మినేని సీతారామ్ ను తాను గౌరవంగా కుర్చీవరకూ వచ్చి కూర్చోబెట్టానని గుర్తుచేశారు. ఈరోజు చెవిరెడ్డి వ్యాఖ్యలపై అసెంబ్లీలో మాట్లాడుతూ..‘అధ్యక్షా.. చంద్రబాబు తన బంట్రోతును పంపారు అన్న మాట మీకు తీపిగా ఉంటే దాన్ని మీ విజ్ఞతకే వదిలేస్తున్నా.

ఇదే విషయంపై మాట్లాడిన చంద్రబాబు అచ్చెన్నాయుడుని బంట్రోతు అంటారా? అంటూ చెవిరెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డారు. చరిత్రను ఎవరూ మర్చిపోలేరని, పార్టీలు పోటీ చేసుకున్న సంధర్భాలు తప్పతే స్పీకర్‌గా ఎంపిక ఇటువంటి సంధర్భాల్లో గౌరవం ఇవ్వాలని అయితే.. అధికార పార్టీ నాయకుడు కానీ పార్టీకి సంబంధించిన ఎవ్వరు కానీ మా మాట అడగలేదని, ప్రతిపక్ష నాయకుడు వస్తాడని చెప్పి ఉంటే వచ్చేవాడిని అని అయితే గౌరవంగా పిలవలేదని, పిలవని పేరంటానికి ఎలా వస్తాం అని చంద్రబాబు అన్నారు.

అయితే ఇదే విషయంపై మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్.. అన్నీ పార్టీల నాయకులు వచ్చి స్పీకర్ గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టమని ప్రొటెం స్పీకర్ అన్నారని, అయితే చంద్రబాబు రాలేదని, మా మాటలను వక్రీకరిస్తున్నారు అని అన్నారు. నాకు బొట్టు పెట్టలేదు.. చీర ఇవ్వలేదు.. అంటే ఎలా? అంటూ ప్రశ్నించారు.