ఏపీ ప్రజలకు శుభవార్త. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల కార్యక్రమం పూర్తయింది. తాజాగా 60.53 లక్షల మంది పెన్షనర్లకు రూ.1537.68 కోట్లు విడుదల చేసామని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బుడి ముత్యాల నాయుడు ప్రకటించారు. ఈ ప్రకటనతో పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ..తెల్లవారుజాము నుంచే ఇంటింటికి వెళ్ళి పెన్షన్లను వాలంటీర్లు పంపిణీ చేస్తున్నారని స్పష్టం చేశారు. ఉదయం 08.00 గంటల వరకు 30.69 శాతం పెన్షన్ల పంపిణీ చేయనున్నారు. 18.57 లక్షల మందికి రూ.471.24 కోట్లు అందచేసినట్లు చెప్పారు. పెన్షన్ రాని వారు స్థానిక వాలంటీర్లను కలవాలని మంత్రి బుడి ముత్యాల నాయుడు కోరారు.
2022 జనవరి 1 నుంచి ఏపీలో పెన్షన్ పెంచుతున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. రెండేళ్ల తర్వాత పెన్షన్ పెంపుపై సర్కార్ నిర్ణయం తీసుకున్నది. జనవరి 1 నుంచి పెన్షన్‌ను రూ.2,500కి పెంచనుంది. 2019 జూన్‌లో రూ.250లను ప్రభుత్వం పెంచింది.