సీఎం జగన్ పై డోస్ పెంచిన టీడీపీ ఎమ్మెల్యే

సీఎం జగన్ పై డోస్ పెంచిన టీడీపీ ఎమ్మెల్యే

0
80

రాజధాని విషయంలో అనేక విమర్శలు ఆరోపణలు వైసీపీపై, ముఖ్యమంత్రి జగన్ పై తెలుగుదేశం చేస్తోంది, మూడురాజధానుల విషయంలో జగన్ ఒంటెద్దు పోకడలు అని విమర్శలు చేస్తున్నారు, అయితే తెలుగుదేశం నుంచి చంద్రబాబుకి ఇద్దరు నేతలు ఫుల్ సపోర్ట్ ఉంటున్నారు.. వారిలో ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఒకరు అయితే, మరొకరు నిమ్మలరామానాయుడు. ఇరువురు కూడా ఫుల్ సపోర్ట్ గా చంద్రబాబుకి నిలుస్తున్నారు.

అమరావతి ముంపు ప్రాంతం అనేది పచ్చి అబద్ధం అని టీడీపీ నేత నిమ్మల రామానాయుడు అన్నారు… అమరావతి రాజధానిగా తగదని అనడం సరికాదన్నారు ఆయన, అమరావతిపై వైసీపీ తీసుకున్న నిర్ణయం సరికాదు అని అన్నారు
ప్రభుత్వ పెద్దలు ఆరోపిస్తున్నట్లుగా అమరావతి ఏ ఒక్క సామాజికవర్గానికి చెందినదో కాదని, రాష్ట్ర ప్రజలందరి భవిష్యత్ అని పేర్కొన్నారు .

అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ చేస్తున్న ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో జ్యూడిషియల్ ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేశారు. వాస్తవం అని తేలితే వారిపై చర్యలు తీసుకోవాలి అంతేకాని పేద ప్రజల ను రైతులని ఇబ్బందులు పాలు చేయవద్దు అని చెప్పారు, ఏపీ సీఎం జగన్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆయన తీవ్ర విమర్శలు చేశారు.