సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన టీడీపీ నేత లోకేశ్

సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన టీడీపీ నేత లోకేశ్

0
103

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై టీడీపీ నేత ఎమ్మెల్సీ నారా లోకేశ్ నిప్పులు చెరిగారు… వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కొత్తగా ఒక్క రోడ్డు వేసింది లేదని ఆరోపించారు…

సర్కార్ కనీసం గుంతలు కూడా పూడ్చలేదని మండిపడ్డారు… అలాంటిది రోడ్డు అభివృద్ధి పన్ను విధించడం ఘోరం అని మండిపడ్డారు. పీల్చే గాలిపై కూడా
ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శిస్తు వసూలు చెయ్యడం ఖాయం అని ఆరోపించారు..

పొరుగు రాష్ట్రాల కంటే అధికంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజల్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు పెట్రోల్, డీజిల్ పై అదనంగా రూ.5 వసూలు చేస్తూ ప్రజలపై వేసిన భారం ఏడాదికి రూ.2500 కోట్లని లోకేశ్ అన్నారు… కుడి చేత్తో రూపాయి ఇచ్చి ఎడమ చేత్తో 10 రూపాయిలు కొట్టేయడమే జగన్ రివర్స్ టెండరింగ్ ప్రక్రియ మహత్యం అని ఆరోపించారు…