సీఎం జగన్ యమ బిజీగా ఉంటే… చంద్రబాబు మాత్రం రిలాక్స్ మూడ్ లో

సీఎం జగన్ యమ బిజీగా ఉంటే... చంద్రబాబు మాత్రం రిలాక్స్ మూడ్ లో

0
98

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజు 18 గంటలు పనిచేసే వ్యక్తి నిత్యం ప్రజల మధ్యలో ఉండేవారు… ఆయన నిద్రపోరు ఇంకెవ్వరిని నిద్రపోనివ్వరంటారు…అయితే అటువంటి చంద్రబాబు నాయుడు.. మాజీ ముఖ్యమంత్రి, విపక్ష నేత వంటి ట్యాగులను పక్కన పెట్టేసి ఒక సామాన్య పౌరుడిలా మారిపోయారు…

తెలంగాణలో సీనియర్ సిటిజన్ లా సెల్ఫ్ క్వారంటైన్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు…చంద్రబాబు నాయుడు తాను ఊపిరి ఉన్నంతవరకు రాజకీయాలు చేస్తానని చెబుతుంటారు.. కానీ ఇంత తొందరగా ఆయనకు విశ్రాంతి లభిస్తుందని బహుషా ఆయనకూడా ఊహించి ఉండరు…ఇన్ని రోజులు ఇంత సమయం చంద్రబాబు నాయుడు ఇలా ఇంట్లో ఉండటం రాజకీయంగా పుట్టి బుద్దెరుగి ఉండరు…

ప్రతి ఇంట్లో అందరి పెద్దల్లాగానే సీనియర్ సిటిజన్ల మాదిరిగానే చంద్రబాబు కూడా ఇప్పుడు టీవీల్లోనే వార్తలు చూస్తూ గడుపుతున్నారు…ఈ క్రమంలో ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బీజీగా ఉంటే చంద్రబాబు నాయుడు మాత్రం అతి సాధారణ పౌరుడిలా టీవీలు చూస్తూ.. గడపాల్సి వస్తోంది…