సీఎం జగన్ ఆయనకు ఛాన్స్ ఇస్తారా ఇవ్వరా….

సీఎం జగన్ ఆయనకు ఛాన్స్ ఇస్తారా ఇవ్వరా....

0
92

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల అయింది.. దీంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది… గతంతో మూడు రాజధానుల ప్రతి పాధన రావడంతో శాసనమండలికి బిల్లువెళ్లడం అక్కడ టీడీపీ మెజారిటీ ఉండటంతో డొక్క మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేశారు…

ఆయన రాజీనామా చేసిన కొద్దిరోజులకు వైసీపీలో చేరిపోయారు… ఇప్పుడు ఈ స్థానం ఎవరికి కేటాయిస్తారన్నది పెద్ద ప్రశ్నగా మారుతోంది… 151 శాసన సభ్యులు ఉన్న వైసీపీకే ఈ సీటు దక్కనుంది… తిరిగి డొక్కాకే ఎమ్మెల్సీ ఇస్తారని ప్రచారం ఒక వైపు ఉంటే మరోవైపు అదే సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని మరికొందరు పట్టుబడుతున్నారు…

అతి తక్కువ కాలం ఉన్న ఈ పోస్ట్ లో జగన్ ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి… కాగా 2014 ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన డొక్కాకు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ ఇచ్చారు… 2019 ఎన్నికల్లో పత్తిపాడు నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు… తన ఓటమికి కారణం గల్లా జయదేవ్ అని డొక్కా ఆరోపణలు చేశారు…