సీఎం కేసీఆర్ మ‌రో కీల‌క నిర్ణ‌యం? వారికి కాస్త ఊర‌ట

సీఎం కేసీఆర్ మ‌రో కీల‌క నిర్ణ‌యం? వారికి కాస్త ఊర‌ట

0
101

క‌రోనా వైర‌స్ వ‌ల్ల ప్ర‌జ‌లు చాలా ఇబ్బందులు ప‌డుతున్నారు, మ‌రీ ముఖ్యంగా కూలీ నాలీ చేసుకునేవారికి చాలా ఇబ్బందిగా ఉంటోంది, ఇక తెలంగాణ‌లో కూడా ఎక్క‌డ వారు అక్క‌డే ఉన్నారు, వివిధ ప్రాంతాల నుంచి వ‌చ్చి ఇక్క‌డ ఉద్యోగాలు చేసే వారు ఉన్నారు.

అయితే ప‌నులు లేక ఇబ్బందులు ప‌డుతున్న వారు చాలా మంది ఉన్నారు వారికి కూడా ఆక‌లి తీరుస్తోంది స‌ర్కార్.. ఈ స‌మయంలో సీఎం కేసీఆర్ ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.ఆస్తి పన్ను చెల్లింపులకు కాస్త ఊరటనిచ్చే విధంగా.. 2019-20 ఫైనాన్షియల్ ఇయర్ ఆస్తి పన్ను చెల్లింపులను ఎలాంటి ఫైన్ లేకుండా 3 నెలల గడువు పెంచుతూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

ఇది చాలా మందికి ఇళ్లు ఉన్న వారికి ఊర‌ట‌నిచ్చే అంశం అనే చెప్పాలి. దీనిపై సీఎం కేసీఆర్ సైన్ చేశారు, ఇక క‌రోనా వ‌ల్ల ఈ ఆస్ది ప‌న్ను క‌ట్టేవారు ఆన్ లైన్ ద్వారా క‌ట్టాలి అని అధికారులు చెబుతున్నారు దానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అధికారులు.