ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు. రోశయ్య భౌతికకాయానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. మంత్రులతో కలిసి అమీర్‌పేట్‌లోని రోశయ్య నివాసానికి చేరుకున్న సీఎం..రోశయ్య భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులను ఓదార్చిన కేసీఆర్.. వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రోశయ్య మృతిపట్ల సంతాపం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది. మూడ్రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది.