కరోనా వైరస్ నేపథ్యంలో గ్రీన్ ఆరెంజ్ రెడ్ జోన్లుగా కొన్ని కేంద్రీకరించారు, అంతేకాదు కరోనా పాజిటీవ్ కేసులు ఎక్కువగా ఉన్న కంటైన్మెంట్ జోన్లులో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ముఖ్యంగా ఇక్కడ ఎవరిని బయటకు రానివ్వడం లేదు, అయితే పోలీసులే వారికి ఏ వస్తువులు కావాలి అన్నా తెచ్చి ఇస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఢిల్లీలోనూ అనేక ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. అయితే, ఆ జోన్లలోని ప్రజలు లాక్ డౌన్ కారణంగా జిహ్వచాపల్యాన్ని చంపుకోలేక, నచ్చింది తినడానికి కావాలి అని కోరుతున్నారు, పాపం పోలీసులు చికెన్ మటన్ అడిగినా తెచ్చిఇస్తున్నారట.
దీనిని మించి కొందరు చికెన్ బిర్యానీ కావాలని, మటన్ కర్రీ కావాలని, పిజ్జాలు, స్వీట్లు, వేడివేడి సమోసాలు కావాలని కోరుతున్నారట. ఇక పోలీసులు డ్యూటీలు కాకుండా వీరికి డెలివరీ చేయడానికే సమయం సరిపోతోంది అని బాధపడుతున్నారట. అక్కడ కూరగాయలు, పండ్లు, పప్పులు బియ్యం, పాలు మందులు మినహ మరేవీ తీసుకురావద్దు అని పోలీసు ఉన్నతాధికారులు ఆర్డర్ వేశారట.