కరోనా ఎఫెక్ట్ – 460 కిలోమీటర్లు నడిచిన పోలీస్ ? విషయం తెలిస్తే షాక్

కరోనా ఎఫెక్ట్ - 460 కిలోమీటర్లు నడిచిన పోలీస్ ? విషయం తెలిస్తే షాక్

0
409

కరోనా వైరస్ మహమ్మారి ఎక్కడ వారిని అక్కడ నిలువరించేలా చేసింది… ఏప్రిల్ 14 వరకూ దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అని ప్రకటించింది కేంద్రం, ఇక ఇప్పుడు మరో 15 రోజులు పొడిగించాయి పలు రాష్ట్రాలు.. దీంతో ఈనెల మొత్తం దేశం లాక్ డౌన్ లో ఉంటుంది.

అయితే ఇంతటి దారుణమైన విపత్కర సమయంలో ఎక్కడ వారు అక్కడే ఉండిపోయారు, ఈ సమయంలో పోలీసులు వైద్యులు చేసే సేవ మరువలేనిది. తాజాగా ఓ పోలీస్ తన భార్య అనారోగ్యంగా ఉందని సెలవుపెట్టాడు, అయితే తర్వాత తన భార్య దగ్గరకు వెళ్లాడు, అక్కడ ఉండగానే లాక్ డౌన్ ప్రకటించారు.

దీంతో వెంటనే డ్యూటీకి రావాలి అని తెలిపారు, దీంతో అతను ఏకంగా ఏ వాహనం లేకపోవడంతో కాలినడకన ఇంటి నుంచి జబల్ పూర్ బయలుదేరాడు. ఇలా సుమారు 460 కిలో మీటర్లు ప్రయాణించాడు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ నుంచి మధ్యప్రదేశ్లోని జబల్పూర్ వరకు నడిచి ఉద్యోగ బాధ్యతల్లో చేరాడు.