తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేస్తూ బాబుని ఏకిపారేస్తాం అని చెబుతారు కొందరు నేతలు.. అయితే బాబు కుటుంబంలో వ్యక్తులని వైసీపీలో చేర్చుకుని బాబుని పార్టీ తరపున ఏపీలో ఇబ్బంది పెట్టాలి అని చూస్తారు.. కాని సీన్ ఒక్కోసారి రివర్స్ కూడా అవుతుంది.. ఆనాడు వైయస్ అయితే నేడు జగన్ అదే పని చేస్తున్నారు.. తాజాగా దగ్గుబాటి వెంకటేశ్వరరావుని పర్చూరు నుంచి ఎమ్మెల్యేగా వైసీపీ బరిలోకి దింపింది.. అయితే వైయస్ కుటుంబం దగ్గుబాటి కుటుంబాన్ని కేవలం బాబుని ఇబ్బంది పెట్టడానికే ఆనాటి నుంచి ఈనాటి వరకూ దగ్గరకు చేర్చుకున్నారు అని అంటారు…
ఆనాడు కేంద్ర మంత్రి పదవి ఇవ్వడానికి వైయస్ కారణం అయితే, నేడు జగన్ అధికారంలోకి వస్తే వెంకటేశ్వరావుకి మంత్రి పదవి స్టేట్ లో ఇచ్చేందుకు సిద్దం అయ్యారు అని అంటున్నారు తెలుగుదేశం నేతలు..కాని టీడీపీ పర్చూరులో 4500 ఓట్లతో గెలుస్తుంది అని చెబుతున్నారు, ఇటీవల వచ్చిన సర్వేలో వెల్లడి అయింది అంటున్నారు.. సర్వేలో చాలా మంది మంత్రి పదవి కోసం బాబుని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా రెండు కారణాలతో దగ్గుబాటిని దగ్గరకు జగన్ చేర్చుకున్నారు అని అభిప్రాయంగా చెప్పారట. అంతేకాదు ఐదు సంవత్సరాలు ఎలాంటి పోరాటం చేయని దగ్గుబాటి వెంకటేశ్వరరావు కేవలం కుమారుని పొలిటికల్ ఫ్యూచర్ ఆలోచించి పార్టీలో చేరారు అని అంటున్నారు జనం.