డిఫరెంట్ ఆలోచలు డిఫరెంట్ ఆఫర్లను ప్రకటించిన…. రోజా

డిఫరెంట్ ఆలోచలు డిఫరెంట్ ఆఫర్లను ప్రకటించిన.... రోజా

0
79

ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్… నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు… తన నియోజకవర్గంలో ప్లాస్టిక్ ను తరిమికొట్టాలనే ఉద్దేశంతో ఆమె డిఫరెంట్ గా ఆలోచించారు… కిలో ప్లాస్టిక్ వ్యర్థాలను తెచ్చిన వారికి కిలో బియ్యన్ ఉచితంగా ఇస్తామని రోజా ఆఫర్ చేశారు…

ఆ విషయాన్ని సోషల్ మీడియాలో ఆమె స్వయంగా ప్రకటించారు… తన నియోజకవర్గంలో ప్లాస్టిక్ మహమ్మారిని అంతమొందించాలనే ఉద్దేశంతో తాము ఈ ఆఫర్ ను ప్రకటించానని తెలిపారు రోజా…

రానున్న రోజుల్లో నగరి నియోజకవర్గంలో ప్రతీ మున్సిపాలిటీ, పంచాయితీ వార్డులు పరిశుభ్రంగా ఉండాలని తెలిపారు… అందుకే ప్లాస్టిక్ ను ఏరవేయ్యాలని అన్నారు రోజా… స్వచ్చ నగరి నియోజకవర్గాన్ని సాధించి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలని రోజా పిలుపునిచ్చారు..