ఎక్కడో చైనాలోని వుహాన్ లో పుట్టిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది… ఈ మాయదారి మహమ్మారి అభిృద్ది చెందిన దేశాలను వదలకుంది అలాగని అభివృద్ది చెందుతున్న దేశాలను వదలేదా అంటే ఆ దేశాలను కూడా వదలకుంది…
అన్ని దేశాలు కరోనా బారిన పడ్డాయి… అయితే ప్రస్తుతం చైనా మాత్రం ప్రశాంతంగా ఉంది.. వుహాన్ లోని ప్రజులు భహిరంగంగా పార్టీలు చేసుకుంటున్నారు… ఇదే ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి… మరో వైపు చైనా అధికారులు కీలక ప్రకటన చేశారు…
బహిరంగ ప్రదేశాల్లో జనాలు మాస్కులు ధరించాలన్న నిబంధనను చైనా ఎత్తివేసింది… బీజింగ్ లో మాస్క్ ధరించకుండా కూడా ప్రజలు బయటకు వెళ్లవచ్చని తెలిపింది… 13 రోజులు గా ఒక్క కరోనా కేసు కుడా ఇక్కడ నమోదు అవ్వలేదు దీంతో ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు…