దొంగదారిలో సీఎం జగన్….

దొంగదారిలో సీఎం జగన్....

0
91

రాజధాని కోసం స్వచ్ఛందంగా భూమి ఇచ్చిన రైతుల్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చంపేస్తున్నారని టీడీపీ నేత లోకేశ్ ఆరోపించారు…. ఈ దున్నపోతు ప్రభుత్వం అక్రమ కేసులతో రైతులను బలితీసుకుంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు… రాజధాని తరలింపు ఆందోళనతో రైతుల మరణాలన్ని ప్రభుత్వ హత్యలే అని లోకేశ్ ఆరోపించారు…

కొద్దికాంగా శాంతియుతంగా ఉద్యమంలో పాల్గొంటున్న కొడుకు, కోడలి పై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడంతో రైతు అబ్బూరి అప్పారావు ఆందోళనతో మృతి చెందారని అన్నారు. మహిళా రైతు సామ్రాజ్యమ్మ గుండె పోటుతో మరణించిందని లోకేశ్ ఆరోపించారు…

ఈ ఘటనలు తనను బాధకలిగించిందని అన్నారు లోకేశ్… రాష్ట్రం కోసం త్యాగం చేసిన రైతులకి ఈ పరిస్థితి రావడం దారుణం అరోపించారు…. చేసేవి దొంగ పనులు కాబట్టే గ్రామాల్లో వేల సంఖ్యలో పోలీసులను దింపారని లోకేశ్ మండిపడ్డారు… ప్రజల మధ్యలోంచి కాకుండా జగన్ మోహన్ రెడ్డి దొంగ దారిలో వెళ్లడానికి కొత్త రోడ్డు ఏర్పాటు చేసుకున్నారని ఆరోపించారు…