ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్‌

0
94

ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ద్రౌపది ముర్ము నామినేషన్‌ దాఖలు చేశారు. రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరిస్తున్న రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ పీసీ మోదీకి ఆమె నామనేషన్​ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు, భాజపా, ఎన్డీఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.

అయితే మొదట బీజేపీ అభ్యర్థిగా ఎన్నో పేర్లు వినిపించాయి. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఛత్తీస్ గఢ్ గవర్నర్ అనసూయ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే ఉన్నట్టుండి రేసులోకి జార్ఖంజ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము తెరపైకి వచ్చింది. చివరకు ఆమె పేరును ఖరారు చేస్తూ అధికారికంగా ప్రకటన ఇచ్చేశారు.