భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఇవాళ ప్రమాణస్వీకారం

0
94

భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఇవాళ ప్రమాణస్వీకారం చేయనున్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్​వీ రమణ..ముర్ము చేత ప్రమాణస్వీకారం చేయిస్తారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఉదయం 10.15 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది.

పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఉదయం 10.15 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. అనంతరం సైనికులు.. ముర్ముకు ’21 గన్ సెల్యూట్’ సమర్పిస్తారు. సైనిక వందనం స్వీకరించిన తర్వాత రాష్ట్రపతి హోదాలో ముర్ము ప్రసంగిస్తారు.

ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్​సభ స్పీకర్ ఓంబిర్లా, మంత్రిమండలి సభ్యులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, దౌత్యవేత్తలు, కీలక సైనికాధికారులు, ఉన్నతాధికారులు హాజరవుతారని కేంద్ర హోంశాఖ వెల్లడించింది.